Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి - పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా

02-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఇండియా మిషన్ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక ఇండియా మిషన్ హై స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం భావోద్వేగభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను,ఉపాధ్యాయులతో మరియు స్నేహితులతో ఏర్పడిన అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ...విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యలోనూ రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల స్థాపన నుంచీ ఇప్పటివరకు అత్యుత్తమ విజయాలను నమోదు చేస్తూ..ముందుకు సాగుతోందని,ఈ ఏడాది విద్యార్థులు కూడా ఆ విజయ పరంపరను కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు తమ సీనియర్లకు శుభాకాంక్షలు తెలియజేసి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థినీ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి - పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా

Article Image

ఇండియా మిషన్ హై స్కూల్లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక ఇండియా మిషన్ హై స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ ఎస్.జూడా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం భావోద్వేగభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను,ఉపాధ్యాయులతో మరియు స్నేహితులతో ఏర్పడిన అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ...విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యలోనూ రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాల స్థాపన నుంచీ ఇప్పటివరకు అత్యుత్తమ విజయాలను నమోదు చేస్తూ..ముందుకు సాగుతోందని,ఈ ఏడాది విద్యార్థులు కూడా ఆ విజయ పరంపరను కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు తమ సీనియర్లకు శుభాకాంక్షలు తెలియజేసి, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థినీ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News