Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:12 AM

పొలం నుంచి పౌష్టికాహారం వరకు… మునగ పొడితో యువ రైతు సక్సెస్ స్టోరీ

14-04-2026 179 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామానికి చెందిన యువ రైతు పి. నాగరాజు వ్యవసాయంలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి, మునగ పంటను సాగు చేస్తూ దాని ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తిగా మునగ పొడిని తయారు చేస్తున్నారు. మునగలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో పాటు రక్తంలో చక్కెర నియంత్రణ, రోగనిరోధక శక్తి పెంపులో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోషక విలువలను ప్రజలకు సహజ రూపంలో అందించాలనే ఉద్దేశంతో నాగరాజు ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా తన పొలంలో పండించిన మునగ ఆకులను శుభ్రపరిచి, సహజ పద్ధతిలో ఎండబెట్టి నాణ్యమైన పొడిని తయారు చేస్తున్నారు.“ప్రజలకు శుద్ధమైన, పోషకాహారం అందించాలనే లక్ష్యంతోనే ఈ ప్రయత్నాన్ని ప్రారంభించాను. మునగ పొడి ప్రతి ఇంటికీ చేరాలని కోరుకుంటున్నాను” అని నాగరాజు తెలిపారు. ప్రస్తుతం ఈ మునగ పొడికి స్థానికంగా మంచి ఆదరణ లభిస్తోంది. గ్రామస్థులతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు కూడా ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించే ఈ విధానం ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తూ, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించే దిశగా ముందుకు సాగుతోంది.

Sthanikam

పొలం నుంచి పౌష్టికాహారం వరకు… మునగ పొడితో యువ రైతు సక్సెస్ స్టోరీ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News