Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:08 PM

పోక్సో కేసుల వేగవంత పరిష్కారంపై సమీక్ష సమావేశం

01-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో కేసుల పరిష్కారం, బాధితుల రక్షణ, పునరావాసంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది.

సంస్థ అధ్యక్షులు, జిల్లా న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు సమావేశం నిర్వహించగా, పోక్సో కోర్టు ప్రత్యేక అదనపు జిల్లా న్యాయమూర్తి మిలింద్ కాంబ్లీ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పోక్సో కేసుల విచారణలో జాప్యం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసులు, చైల్డ్ లైన్ ప్రతినిధులకు మార్గదర్శకాలు ఇచ్చారు. బాధితులకు చట్టపరమైన రక్షణతో పాటు తక్షణ సహాయం, పునరావాసం కల్పించడంలో సమన్వయం అవసరమని పేర్కొన్నారు.

కేసుల దర్యాప్తు, చార్జిషీట్ దాఖలు, సాక్ష్యాల సమర్పణ వంటి ప్రక్రియలు వేగవంతంగా పూర్తి చేయాలని, బాలల హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత, జెజెబి కోర్టు న్యాయమూర్తి స్వాతి, సీడబ్ల్యూసీ అధ్యక్షులు బండారు జయశ్రీ, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ అనంత లక్ష్మి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. రవీందర్ రెడ్డి, సఖి వన్ స్టాప్ సెంటర్ ప్రతినిధులు, భువనగిరి టౌన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోక్సో కేసుల వేగవంత పరిష్కారంపై సమీక్ష సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News