Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:14 PM

పోచంపల్లి చేనేతకు ఊతం – కార్మికుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ అనురాగ్ జయంతి

01-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోచంపల్లి గ్రామంలోని చేనేత సహకార సంఘం మరియు చేనేత యూనిట్లను అనురాగ్ జయంతి శనివారం సందర్శించి కార్యకలాపాలను పరిశీలించారు. చేనేత కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి పనితీరు, ఉపాధి అవకాశాలు, మార్కెటింగ్ విధానం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సంఘం ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తోందో, తయారైన వస్త్రాలను ఎక్కడ విక్రయిస్తున్నారో తెలుసుకొని తగిన సూచనలు చేశారు. అనంతరం సాయిని భారత్‌కు చెందిన చేనేత యూనిట్‌ను సందర్శించి చీరల తయారీ వివిధ దశలను పరిశీలించారు. చేనేత కార్మికుల కళా నైపుణ్యాన్ని అభినందిస్తూ వారి శ్రమే ఈ రంగానికి బలమని పేర్కొన్నారు.

కార్మికుల ఇళ్లను సందర్శించిన కలెక్టర్ వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. నెలవారీ ఆదాయం, పట్టుదారం కొనుగోలు విధానం, తయారైన చీరల విక్రయ మార్గాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ఏ అవసరం ఉన్నా అధికారులకు తెలియజేయాలని భరోసా ఇచ్చారు.

ప్రసిద్ధ పోచంపల్లి ఇక్కత్ చీరల తయారీ విధానం, డిజైన్ ప్రక్రియ, టై-అండ్-డై పద్ధతిలో ముందుగానే డిజైన్ వేయడం వంటి ప్రత్యేకతలను ప్రత్యక్షంగా పరిశీలించారు. దేశ విదేశాల్లో ఈ చీరలకు ఉన్న డిమాండ్, రంగుల సమన్వయం, సంప్రదాయ కళాత్మకత పోచంపల్లిని చేనేత రంగంలో ప్రత్యేక స్థాయికి చేర్చాయని తెలిపారు. ఒక చీర తయారీలో అనుసరించే దశల వారీ ప్రక్రియను కళాకారులు కలెక్టర్‌కు వివరించారు.

చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మికులకు మరింత ప్రోత్సాహం అందించే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేఖర్ రెడ్డి, చేనేత శాఖ అధికారులు, సహకార సంఘం చైర్మన్ భారత వాసుదేవ్, సోసైటీ సభ్యులు, స్థానిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోచంపల్లి చేనేతకు ఊతం – కార్మికుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News