Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:01 AM

పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం

15-04-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయం నిర్మాణానికి గ్రామస్థులు సహకారం అందిస్తున్న వేళ, ఇటీవల వీరభద్రేశ్వర జాతర మహోత్సవం సందర్భంగా ప్రదర్శించిన “పెద్దిరాజు పెద్దమ్మ” పౌరాణిక నాటకంలో పాల్గొన్న నాటకమండలి సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నాటకంలో పాత్రధారులకు కట్నకానుకల రూపంలో వచ్చిన సుమారు 60,000 రూపాయలను వ్యక్తిగతంగా వినియోగించకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా దైవకార్యానికి వినియోగించాలని అందరూ కలిసి నిర్ణయించారు. బుధవారం గ్రామ పెద్దలు మరియు దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యుల సమక్షంలో ఈ మొత్తాన్ని పోచమ్మ దేవాలయం నిర్మాణానికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా నాటకమండలి సభ్యులు మాట్లాడుతూ దైవకార్యానికి సహాయం చేయడం తమకు సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నాటకమండలి సభ్యుల ఈ సేవా భావాన్ని గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు అభినందిస్తూ, ఇది ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Sthanikam

పోచమ్మ దేవాలయం నిర్మాణానికి నాటకమండలి సభ్యుల విరాళం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News