Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:15 AM

ఫోన్ ట్యాపింగ్ పేరిట కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యలు

01-02-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

- కేసారం గ్రామంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన,రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో గౌరవ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారి పిలుపుమేరకు,భువనగిరి నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేసారం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

గ్రామశాఖ అధ్యక్షులు కమ్మగాని నర్సింహా గౌడ్ గారి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సత్యనారాయణ, పోచయ్య, సత్యనారాయణ, భాస్కర్, బాలయ్య, రాములు, ఆంజనేయులు, భాస్కర్, ఇమ్రాన్, నర్సింగ్ రావు, సుభాష్, సురేష్, గణేష్, ఉమేష్, సాయి, సంపత్, వంశీ, ఐలెయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు హాజరై సంఘీభావం తెలిపారు.

ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ గారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ, బీఆర్‌ఎస్ పార్టీని అణిచివేయాలనే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.

Sthanikam

ఫోన్ ట్యాపింగ్ పేరిట కేసీఆర్‌పై కక్షసాధింపు చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News