Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:13 PM

పెండింగ్ క్రిమినల్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు

01-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కోర్టు భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు, జైలులో ఉన్న ఖైదీల కేసుల పరిష్కారం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

కేసుల విచారణలో జాప్యం తగ్గించడంతో పాటు ఖైదీలకు న్యాయ సహాయం అందించడం, సాక్షి రక్షణ పథకం–2018 అమలు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని న్యాయాధికారులు, పోలీసు అధికారులకు సూచనలు జారీ చేశారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని తమ వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత, అదనపు పోలీసు సూపరింటెండెంట్ లక్ష్మి నారాయణ, సబ్‌జైలు సూపరింటెండెంట్ నెహ్రు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెండింగ్ క్రిమినల్ కేసుల త్వరిత పరిష్కారానికి చర్యలు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ – జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కోర్టు భవనంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు, జైలులో ఉన్న ఖైదీల కేసుల పరిష్కారం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

కేసుల విచారణలో జాప్యం తగ్గించడంతో పాటు ఖైదీలకు న్యాయ సహాయం అందించడం, సాక్షి రక్షణ పథకం–2018 అమలు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని న్యాయాధికారులు, పోలీసు అధికారులకు సూచనలు జారీ చేశారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని తమ వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత, అదనపు పోలీసు సూపరింటెండెంట్ లక్ష్మి నారాయణ, సబ్‌జైలు సూపరింటెండెంట్ నెహ్రు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News