Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:07 AM

పట్టువస్త్రాలతో నల్లపోచమ్మకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు

27-04-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు వారాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. మహోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలు సమర్పించి, విశేష ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహోత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేపట్టారు. ఈ వేడుకలు మరిన్ని రోజులు భక్తి ఉత్సాహాల మధ్య కొనసాగనున్నాయి.

Sthanikam

పట్టువస్త్రాలతో నల్లపోచమ్మకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు వారాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. మహోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ అర్చకులు నాగేష్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలు సమర్పించి, విశేష ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహోత్సవాల సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లు చేపట్టారు. ఈ వేడుకలు మరిన్ని రోజులు భక్తి ఉత్సాహాల మధ్య కొనసాగనున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News