Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:17 AM

పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణ… నీట్‌కు జిల్లా పరిపాలన అప్రమత్తం

27-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో మే 3న నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో పరీక్ష ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 2,772 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా, వారి కోసం 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మే 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులను ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, భద్రతా తనిఖీలు ఉండటంతో విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డు పై తప్పనిసరిగా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అతికించుకుని, అదనంగా మరో ఫోటోతో పాటు ఫోటో ఐడీ ప్రూఫ్ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్‌లు, పర్సులు, బెల్ట్‌లు, ఆభరణాలు తదితర నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ప్రశ్నాపత్రాల రవాణా, జవాబు పత్రాల భద్రతకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖకు సూచించగా, విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా, త్రాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలు సమకూర్చాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన ఈ పరీక్షను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాండు, సంబంధిత శాఖల అధికారులు, సెంటర్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, డీఎంహెచ్ఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్టీవో, ఆర్టీసీ, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణ… నీట్‌కు జిల్లా పరిపాలన అప్రమత్తం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News