Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:07 AM

పర్యావరణ హిత చర్యలతోనే భవిష్యత్ సురక్షితం – కలెక్టర్ ప్రావీణ్య

21-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

అంతర్జాతీయ మదర్ ఎర్త్ డే సందర్భంగా “99 రోజుల ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ పాండు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. భూమిని కాపాడుకోవడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పచ్చదనాన్ని పెంపొందించడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమన్నారు. ప్రకృతి సంపదను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహిత వస్తువులను వినియోగించడం, చెట్ల పెంపకం చేపట్టడం, నీటి వనరులను కాపాడుకోవడం వంటి చర్యలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, యువత పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని, అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే భూమి సంరక్షణ సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, నేషనల్ గ్రీన్ కార్ప్స్ జిల్లా సమన్వయ కర్త మాధవ రెడ్డి, ఎస్‌జిఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణ హిత చర్యలతోనే భవిష్యత్ సురక్షితం – కలెక్టర్ ప్రావీణ్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News