Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

ప్రతి వాహనదారుడు బాధ్యతగా ఉండాలి: ఎస్సై సూచన

16-04-2026 212 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి పరిధిలో ప్రతి వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని వట్టిపల్లి ఎస్సై లవ కుమార్ తెలిపారు. రోడ్లపై ప్రయాణించే సమయంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు మరియు ఇతర వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వాహనదారులు ఇన్సూరెన్స్, ఆర్‌సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు లేకుండా ప్రయాణిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాలను రక్షించుకోవచ్చని సూచించారు. అలాగే వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండటం అత్యంత అవసరమని, ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన వారు లేదా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంలో ఇన్సూరెన్స్ కీలకంగా ఉంటుందని తెలిపారు. ఇతరులకు ప్రమాదం కలిగించిన సందర్భంలో కూడా ఇన్సూరెన్స్ ద్వారా నష్టపరిహారం చెల్లించేందుకు సహాయపడుతుందని చెప్పారు. అందువల్ల ప్రతి వాహనదారుడు తన వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకోవడంతో పాటు సమయానికి రీన్యువల్ చేసుకోవాలని, రోడ్లపై సురక్షితంగా ప్రయాణించేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.

Sthanikam

ప్రతి వాహనదారుడు బాధ్యతగా ఉండాలి: ఎస్సై సూచన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News