Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం

25-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి ప్రజలకు రోజూ రెండు గంటల స్వచ్ఛమైన మంచినీటి సరఫరా కోసం రూ.200 కోట్ల మంజీరా వాటర్ స్కీమ్ విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జగ్గారెడ్డి తెలిపారు. సంగారెడ్డి పట్టణానికి మంజీరా నీటి సరఫరాపై మున్సిపల్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, గతంలో ప్రజలు నీటి కోసం గుంతల్లోకి దిగాల్సిన పరిస్థితి ఉండేదని, ఆ సమస్యను పరిష్కరించేందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.230 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయించామని గుర్తుచేశారు.ప్రస్తుతం పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 50 ఏళ్లకు సరిపడేలా నీటి సరఫరా వ్యవస్థను విస్తరించేందుకు అదనపు ఇంటేక్ వెల్, 8 కొత్త ట్యాంకులు, కొత్త ఫిల్టర్ బెడ్, 1800 కిలోలీటర్ల సంప్, 50 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ నిర్మాణం ప్రతిపాదించామని తెలిపారు. ఆదర్శ్ నగర్, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ పార్క్, రెవెన్యూ కాలనీ, సాయి నగర్, చింతపల్లి తదితర ప్రాంతాల్లో ట్యాంకులు నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రజల అభిప్రాయాలు సేకరించి వచ్చే నెల 5వ తేదీ లోపు పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి, టెండర్లు పూర్తి అనంతరం 2027లో పనులు ప్రారంభించి 2028 నాటికి పూర్తిచేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.సంగారెడ్డి పట్టణంలో ఎక్కడా నీటి కోసం గుంతలు త్రవ్వాల్సిన పరిస్థితి లేకుండా ప్రతి ఇంటికి పుష్కలంగా మంజీరా నీరు అందేలా చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

Sthanikam

ప్రతి ఇంటికి రోజూ రెండు గంటల మంజీరా నీరు లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News