Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో మరో అండర్ పాస్ నిర్మించండి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 06:31 PM

ప్రతి ఎకరానికీ సాగునీరు అందియ్యడమే నా ధ్యేయం..

21-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో నల్గొండ సస్యశ్యామలం..

నల్గొండ : నల్గొండ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల్గొండ మండలంలోని అప్పాజీపేట గ్రామంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న సాగునీటి కాలువలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.​సాగునీటి కాలువల పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సామాన్యుడిలా ద్విచక్ర వాహనాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అప్పాజీపేట శివారులో కాలువ వెంబడి బైక్‌పై ప్రయాణిస్తూ నీటి ప్రవాహాన్ని, కాలువల నిర్మాణాన్ని పరిశీలించారు. మార్గమధ్యలో పొలాల వద్ద ఉన్న రైతులను పలకరించి సాగునీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి తమ వద్దకు వచ్చి మాట్లాడటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.అనంతరం కొండపాకగూడెం నుంచి అప్పాజీపేట వరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న పిల్ల కాలువ పనులకు మంత్రి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కాలువల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి చెరువును నింపుతాం. చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. నియోజకవర్గ రైతాంగం సాగునీటి కోసం ఇబ్బంది పడకూడదన్నదే నా సంకల్పం అని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పిల్ల కాలువ పనులను అత్యంత నాణ్యతతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి ఎకరానికీ సాగునీరు అందియ్యడమే నా ధ్యేయం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News