Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:16 AM

ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ప్రాధాన్యత

02-03-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడంపై జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ప్రత్యేక దృష్టి సారించారు.ప్రజల సమస్యలను సమీక్షించి, సంబంధిత అధికారుల చొరవ ద్వారా త్వరితగతిన పరిష్కరించాలి అని సూచించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు చేరుకుని తమ సమస్యలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, నారాయణఖేడ్, సబ్ కలెక్టర్లు ఉమహారతి కలిసి వినతులను స్వీకరించారు.వినతుల్లో భూ సమస్యలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, విద్య, వైద్య ఆరోగ్య, డబ్ల్యూ ఓ, డీసీ ఎస్ ఓ, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. కలెక్టర్ ఈ సమస్యలను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాల్సినవి అని ఆదేశించారు.ఈ సందర్భంగా మొత్తం 56 అర్జీలు అందినట్లు తెలిపారు.కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను గమనించి, వాటిని తక్షణమే పరిష్కరించడం ముఖ్యమైన బాధ్యత అని, అధికారులు ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై శ్రద్ధ చూపించాలి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓలు, మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం, అవగాహన, మరియు అధికారుల చురుకైన సహకారం నిర్ధారించబడింది.

Sthanikam

ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ప్రాధాన్యత

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News