Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:08 AM

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – అవగాహన సదస్సులో మంత్రి ,ఖేఢ్ ఎమ్మెల్యే

12-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యాచరణపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించి విజయవంతంగా ముగించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ,నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయేందుకు మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను చేపట్టిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమంలో విద్య, వైద్యం,వ్యవసాయం,గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదితర పది ముఖ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఈ కార్యాచరణ ఫలితాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని అధికారులను కోరారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని తెలిపారు.అనంతరం నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అవగాహన సదస్సుకు విచ్చేసిన ఖేడ్ పట్టణ పురపాలక సభ్యులు, గ్రామ సర్పంచులు శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుని కార్యక్రమంపై చర్చించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, పురపాలక సభ్యులు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – అవగాహన సదస్సులో మంత్రి ,ఖేఢ్ ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News