Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:12 AM

ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – కలెక్టర్ స్పష్టం

13-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన మొత్తం 63 దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తమ సమస్యలను నమ్మకంతో ప్రజావాణి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నారని, వాటి పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని, సంక్షేమం, రెవెన్యూ, వ్యవసాయం, గృహనిర్మాణం, మార్కెటింగ్, ఉపాధి తదితర శాఖలకు సంబంధించిన వినతులను అధికారులు ప్రత్యేక దృష్టితో తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం అసలు సహించబోమని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు – కలెక్టర్ స్పష్టం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News