Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు – శ్రీనగర్ కాలనీలో శిబిరం

19-04-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పటాన్‌చెరు విభాగం పరిధిలోని శ్రీనగర్ కాలనీలో మురళీకృష్ణ బెండపూడి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో, యశోద ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం.డి.ఆర్ సేవా సంస్థ సహ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు రక్తపోటు, చక్కెర పరీక్షలు, సాధారణ ఆరోగ్య తనిఖీలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సూచనలు అందించారు. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు ప్రతి వర్గానికి వైద్య సేవలు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించడం మరియు ఆరోగ్యంపై అవగాహన పెంచడం చాలా అవసరమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి శిబిరాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో నర్సింహ రెడ్డి, సునీత, కృష్ణంరాజు, రవీందర్ గిరి, ఆతీయ సుల్తానా, పవన్, వైద్య సిబ్బంది, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల కోసం ఉచిత వైద్య సేవలు – శ్రీనగర్ కాలనీలో శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News