Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

ప్రజా సమస్యలపై బహుజన సేన సమితి వినతిపత్రం

28-02-2026 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎమ్మిగనూరు, పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మున్సిపల్ ఆస్తుల కేటాయింపులో సామాజిక న్యాయం చేయాలని కోరుతూ బహుజన సేన సమితి నాయకులు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, కమిషనర్‌లకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర విలేకరులతో మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. మున్సిపల్ ఆస్తుల కేటాయింపులో అసమానతలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మౌలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఎస్‌ఎమ్‌టి కాలనీ మెయిన్ రోడ్డును వెంటనే నిర్మించాలన్నారు. అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ షాపులను రీ-టెండర్ వేసి, టెండర్ పొందిన వారే వ్యాపారం నిర్వహించేలా నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కాంప్లెక్స్ షాపులను రీ-టెండర్ చేసి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. షరఫ్ బజార్, చిన్న పార్కు కాంప్లెక్స్ షాపుల కేటాయింపులో మాల సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఎస్సీ, బీసీ, కర్నూల్ రోడ్ స్మశాన వాటికల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, వేసవి నేపథ్యంలో అన్ని వార్డులకు తాగునీటి సరఫరా క్రమబద్ధంగా చేయాలని సూచించారు. కొత్తగా నియమితులైన 11 మంది పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిలటరీ కాలనీ, మైనార్టీ కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

సమస్యలను రాబోయే కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలిసి మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కె. చిన్ని ప్రసాద్, నారాయణ, వెంకటేష్, రామాంజి, వీరభద్ర తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా సమస్యలపై బహుజన సేన సమితి వినతిపత్రం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News