Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:23 AM

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

06-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ 6వ వార్డ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పాల్గొని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు,అమలు విధానం,ప్రజలకు అందే ప్రయోజనాల గురించి సమగ్రంగా వివరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం “99 రోజులు – 10 సూత్రాలు – సమగ్ర అభివృద్ధి” అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమాన్ని జూన్ 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించగా,ఆ కార్యాచరణను విజయవంతంగా అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థంగా చేరేలా చేయడం, స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, ప్రతి వార్డ్‌లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు అని సమావేశంలో పేర్కొన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహిర్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్లు సురేఖ (2వ వార్డ్), మహేష్ చౌహాన్ (5వ వార్డ్), లక్ష్మణ్ (6వ వార్డ్),బాణపురం రాజు (9వ వార్డ్), షారుఖ్ (12వ వార్డ్), వివేకానంద మహేందర్ (13వ వార్డ్) పాల్గొన్నారు.అదేవిధంగా అభిషేక్ శెట్కార్, మైతబ్,సుబర్,రామకృష్ణ, గౌస్ చిష్తీ, కొండల్ రెడ్డి, మైపాల్ రెడ్డి, మొయినొద్దీన్ కురేషి తదితర నాయకులు, మున్సిపల్ అధికారులు మరియు స్థానిక ప్రజలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మరియు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు తెలిపారు.

Sthanikam

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News