Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:22 AM

ప్రగతి ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు అవగాహన – కలెక్టర్ ప్రవీణ్య

11-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లాలోని ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఒరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా వివిధ శాఖల ద్వారా 2026 మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయికి సమర్థవంతంగా చేరేలా చర్యలు చేపడతామని చెప్పారు.ఈ నేపథ్యంలో జిల్లాలోని మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, గ్రామ పంచాయతీల సర్పంచులు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు ప్రభుత్వ కార్యక్రమాల అమలు విధానం, లక్ష్యాలు మరియు వివిధ శాఖల ఫ్లాగ్‌షిప్ పథకాల గురించి పూర్తిగా అవగాహన పొందేందుకు ఒక రోజు ప్రత్యేక ఒరియంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ ఒరియంటేషన్ కార్యక్రమం మార్చి 12న (గురువారం) ఉదయం 10 గంటలకు కంది లోని ఎల్.ఎన్. కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబడుతుందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టే కార్యక్రమాలు, అభివృద్ధి చర్యలు, అమలు విధానం గురించి ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు.అందువల్ల జిల్లాలోని అన్ని మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, గ్రామ పంచాయతీల సర్పంచులు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై ప్రభుత్వ కార్యక్రమాలపై పూర్తి అవగాహన పొందాలని జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య కోరారు.

Sthanikam

ప్రగతి ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు అవగాహన – కలెక్టర్ ప్రవీణ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News