Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

ప్రధాని మోడీ ట్రంప్ ల దిష్టిబొమ్మలు దగ్ధం

09-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కార్మిక, రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మలను సోమవారం సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకులు అవిశెట్టి శంకరయ్య మాట్లాడుతూ అమెరికా అధ్యక్షునికి భారత ప్రధాని మోడీ దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతూ దేశంలో స్వేచ్ఛ వాణిజ్యo అమలయ్యే విధంగా చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్మికుల హక్కులను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడమే కాకుండా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ విద్యుత్ సవరణ చట్టం, విత్తన సవరణ చట్టం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి వ్యతిరేక విధానాలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని వీటికి నిరసనగా ఈనెల 12న జరగబోయే దేశవ్యాప్త సమ్మె లో రైతులు, కార్మికులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఐతరాజు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు ఆరూరి శ్రీనివాస్, లడే రాములు, నర్సిరెడ్డి, మహేష్, సత్యనారాయణ, కిరణ్, శేఖర్, ఐలమ్మ, తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

ప్రధాని మోడీ ట్రంప్ ల దిష్టిబొమ్మలు దగ్ధం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News