Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:07 AM

పాలాభిషేకంతో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఆర్యవైశ్య సంఘం

24-04-2026 280 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఈ నిర్ణయం ఆర్యవైశ్య సమాజానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని సంఘ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, ఆలయ కమిటీ అధ్యక్షులు సాయిరాజ్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున శంకర్, కోశాధికారి బిక్షపతి, ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పురం సుధాకర్, యువజన సంఘం అధ్యక్షులు దిడిగే నగేష్, వాసవి క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ తో పాటు చంద్రయ్య, కిషన్, వినోద్, కంది మల్లేశ్, అశోక్, సతీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తబృందం, భజన మండలి సభ్యులు, పట్టణవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

పాలాభిషేకంతో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఆర్యవైశ్య సంఘం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News