Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 04:52 PM

పదో తరగతి పరీక్షలకు నారాయణఖేడ్ డివిజన్‌లో పకడ్బందీ ఏర్పాట్లు

పదో తరగతి పరీక్షలకు నారాయణఖేడ్ డివిజన్‌లో పకడ్బందీ ఏర్పాట్లు

పదో తరగతి పరీక్షలకు నారాయణఖేడ్ డివిజన్‌లో పకడ్బందీ ఏర్పాట్లు
March 13, 2026 10:15 AM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి తెలిపారు. గురువారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ, పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సమగ్ర చర్యలు చేపట్టినట్లు చెప్పారు.డివిజన్ పరిధిలో మొత్తం 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.అందులో అత్యధికంగా నారాయణఖేడ్ మండలంలో 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని, తాగునీరు, విద్యుత్, కూర్చోవడానికి సరైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని పేర్కొన్నారు.పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు డివిజన్ వ్యాప్తంగా ఇద్దరు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.అలాగే ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక్కరు చొప్పున వ్యవసాయ శాఖకు చెందిన 16 మంది ఏఈఓలను సిట్టింగ్ స్క్వాడ్‌లుగా నియమించినట్లు చెప్పారు. ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా సివిల్ సప్లై శాఖకు చెందిన అధికారులు మరియు నిజాంపేట మండల ఉప నాయబ్ తహసీల్దార్‌లను నియమించినట్లు వివరించారు.పరీక్షల సమయంలో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు, పరీక్షా కేంద్రాల ప్రధానోపాధ్యాయులు, పోలీస్ అధికారులు పాల్గొనే సమన్వయ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలిపారు.అలాగే పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఉన్న జిరాక్స్ కేంద్రాలు పరీక్షలు పూర్తయ్యే వరకు మూసివేయాలని ఆదేశించినట్లు చెప్పారు. పరీక్షల సమయంలో ఎవరైనా మాస్ కాపీయింగ్‌కు పాల్పడినా లేదా ఇన్విజిలేటర్లు కాపీయింగ్‌కు సహకరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పరీక్షలు నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని సబ్ కలెక్టర్ ఉమాహారతి కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News