Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:10 AM

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

23-03-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న శ్రీ సాయి కృష్ణ హై స్కూల్‌లో నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షలు జరుగుతున్న తరుణంలో అకస్మికంగా తనిఖీ నిర్వహించి, పరీక్షల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో హాల్ ఏర్పాట్లు,విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సీసీ కెమెరాల అమరిక,భద్రతా చర్యలు వంటి అంశాలను సమీక్షించారు.విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌లు, ఇన్విజిలేటర్లు పరీక్షా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.ఎటువంటి అక్రమాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా అనుమతి లేని వ్యక్తులు కేంద్రంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించకూడదని స్పష్టంగా చెప్పారు.అలాగే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రతి విద్యార్థి తన ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించుకునేలా అనుకూల వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అని చెప్పారు.పరీక్షల నిర్వహణలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చోటు చేసుకోకూడదని హెచ్చరించిన కలెక్టర్, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

ఈ ఆకస్మిక తనిఖీతో పరీక్షా కేంద్రాల్లో అధికారుల అప్రమత్తత మరింత పెరిగింది.

Sthanikam

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News