Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:20 AM

ఒకరోజు అధికారులు గా మారిన విద్యార్థులు… బోరంచ పాఠశాలలో వినూత్న కార్యక్రమం

11-03-2026 234 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయంపాలన దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు మరియు జిల్లా స్థాయి అధికారుల పాత్రలను స్వీకరించి ఒక రోజు పాటు ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. విద్యార్థులు నిజమైన అధికారుల్లా వ్యవహరిస్తూ పాఠశాల నిర్వహణలో పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో స్వాతిక్ రెడ్డి ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించగా, డిప్యూటీ డీఈఓ బి. శ్రావణి,డీఈఓ ఉమా మహేశ్వరి బాధ్యతలు చేపట్టారు.జిల్లా విద్యాధికారిగా సి.ఎస్. స్వాతి, మండల విద్యాధికారిగా మరో విద్యార్థి బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఎం. ప్రవళిక జిల్లా కలెక్టర్ పాత్రను పోషించగా,సంధ్యారాణి సబ్ కలెక్టర్‌గా వ్యవహరించారు.బాధ్యతలు చేపట్టి కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.అలాగే పలు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ తరగతుల్లో పాఠాలు బోధించారు. వారు పాఠాలను బోధించే విధానం, తరగతిని నిర్వహించే తీరు అక్కడి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను ఆకట్టుకుంది. విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో, సమర్థంగా నిర్వహిస్తూ మంచి నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు.కార్యక్రమం అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించి బహుమతులు అందజేసింది.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి రాజశేఖర్ షేట్కార్,ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, పాఠశాల ఉపాధ్యాయులు మహేష్ కుమార్,విజయ్ కుమార్,సాయిబాబా, రవి కుమార్,నర్సింలు,వై నర్సింహులు, జగదీష్ కూమార్, పాఠశాల ఉపాధ్యాయురాలు అనుష, నర్సింహులు, రవి కుమార్, గ్రామ పెద్దలు గ్రామస్తులు యువత యువకులు పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.స్వయంపాలన దినోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఎదగడానికి అవసరమైన అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

ఒకరోజు అధికారులు గా మారిన విద్యార్థులు… బోరంచ పాఠశాలలో వినూత్న కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News