Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

నూజివీడు కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నాయకుల ఆనందం

28-02-2026 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

14 మంది టీడీపీ నాయకులపై నమోదైన ఎన్నికల కేసు కొట్టివేత

చాట్రాయి 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో చాట్రాయి మండలానికి చెందిన 14 మంది టీడీపీ నాయకులకు ఉపశమనం లభించింది. కేసును కొట్టివేస్తూ నూజివీడు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.

మండలానికి చెందిన మందలపు జగదీష్ (చీపురుగూడెం), చాగంటి రాధాకృష్ణ (పోలవరం)లతో పాటు నూజివీడు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 14 మంది నాయకులపై ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో 2019లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి చొరవ తీసుకుని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో చర్చించినట్లు తెలిసింది. విచారణను వేగవంతం చేసి పూర్తి చేసిన అనంతరం కోర్టు కేసును కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడంతో సంబంధిత నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

తీర్పు వెలువడిన వెంటనే కోర్టు ప్రాంగణంలో టీడీపీ నాయకులు ఒకరినొకరు అభినందించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఈ తీర్పును స్వాగతించాయి.

Sthanikam

నూజివీడు కోర్టు తీర్పు తర్వాత టీడీపీ నాయకుల ఆనందం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News