Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:03 AM

నిర్లక్ష్యం బలి అయిన పశువు – కుసునూరులో విషాద ఘటన

21-04-2026 197 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రైయికోడ్ మండలం పరిధిలోని కుసునూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గోపాల్ రెడ్డికి చెందిన ఎద్దు విషపూరిత ద్రావణం తాగి మృతి చెందింది. గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న బోర్ వద్ద ఒక డ్రమ్ములో యూరియా కలిపిన గడ్డి మందు నిర్లక్ష్యంగా ఉంచినట్లు సమాచారం. దాహంతో ఉన్న ఎద్దు ఆ ద్రావణాన్ని తాగడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ డ్రమ్మును గ్రామానికి చెందిన ఈర్స సంగణ పటేల్ ఉంచినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన మాత్రం తనకు సంబంధం లేదని చెప్పడంతో పాటు బాధితులను బెదిరించినట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు.ఈ ఘటనపై గ్రామ సర్పంచ్ రాజశేఖర్ స్పందించకపోవడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎద్దు మృతి చెందడంతో గోపాల్ రెడ్డి కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. వ్యవసాయానికి ముఖ్యమైన ఎద్దును కోల్పోవడంతో వారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికే దహన సంస్కారాలు నిర్వహించిన కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. బాధిత కుటుంబానికి తక్షణం నష్టపరిహారం అందించాలని, నిర్లక్ష్యంగా విషపదార్థం ఉంచిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Sthanikam

నిర్లక్ష్యం బలి అయిన పశువు – కుసునూరులో విషాద ఘటన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News