Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:10 AM

నిజాయితీకి నిదర్శనం – తులం బంగారం పోలీసులకు అప్పగించిన యువకుడు

01-03-2026 142 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలోని తుర్కవర్గాం గ్రామానికి చెందిన సింగే మచ్చేందర్ (తండ్రి: మారెప్ప) నిజాయితీ అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా నిలిచింది.సింగే మచ్చేందర్ కంగ్టి పట్టణంలోని నిర్మల ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం వెళ్లిన సమయంలో అక్కడ ఒక తెలియని కవర్ కనిపించింది. అనుమానం కలిగి ఆ కవర్‌ను తీసి చూడగా అందులో ఒక తులం బంగారం కమ్మలు ఉన్నాయని గమనించాడు. ఆభరణాలు ఎవరో కోల్పోయి ఉంటారని భావించి, స్వార్థపరంగా వ్యవహరించకుండా వెంటనే వాటిని కంగ్టి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు.పోలీసులు ఆ విషయాన్ని స్వీకరించి విచారణ చేపట్టగా, ఆ బంగారం కమ్మలు దుర్గారాజు (తండ్రి: మొగులయ్య) వని గుర్తించారు. వారు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన సమయంలో అనుకోకుండా ఆభరణాలు పోగొట్టుకున్నట్లు తెలిసింది.నిజాయితీతో ఆభరణాలు పోలీసులకు అప్పగించిన సింగే మచ్చేందర్‌ను పోలీసు అధికారి శాలువాతో సన్మానించి అభినందించారు.సమాజంలో ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఉండటం గర్వకారణం. సింగే మచ్చేందర్ చేసిన ఈ మంచిపని, బాధ్యతాయుతమైన ప్రవర్తన ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలి.

Sthanikam

నిజాయితీకి నిదర్శనం – తులం బంగారం పోలీసులకు అప్పగించిన యువకుడు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News