Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించిన పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌

28-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పురపాలక పరిధిలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోడ సుశీల మాట్లాడుతూ నేటి బడి పిల్లలే రేపటి భవిష్యత్ శాస్త్రవేత్తలని పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్రంపైఆసక్తిపెంపొందించుకోవడం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని ఆమె ఆకాంక్షించారు.కార్యక్రమం ప్రారంభంలో నోబెల్ బహుమతి గ్రహీత సి . వి . రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సైన్స్ ఉపాధ్యాయులు “రామన్ ఎఫెక్ట్” గురించి విద్యార్థులకు వివరించారు. శాస్త్రీయ ఆవిష్కరణలు మన దైనందిన జీవితంపై చూపుతున్న ప్రభావాన్ని ఉదాహరణలతో వివరించారు.ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధస్సు అన్ని రంగాల్లో కీలకపాత్రపోషిస్తున్నదనిప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులు విజ్ఞాన శాస్త్రాన్ని సృజనాత్మకంగా వినియోగించుకుంటే దేశ అభివృద్ధికి తోడ్పడగలరని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వర్షాధారిత సాగు, సేంద్రీయ వ్యవసాయం, వాయు పీడనం, గ్లోబల్ వార్మింగ్, ఆహారపు గొలుసు, ఆక్సిజన్ తయారీ, హైడ్రోజన్తయారీ,సూర్యగ్రహణాలు వంటి ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సృజనాత్మకతకు ఉపాధ్యాయులు ప్రశంసలు కురిపించారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎ. పద్మజ, కోణం శ్రీనివాస్, సిహెచ్. ప్రసన్న, ఎన్. సరళ, చిలకరాజు శ్రీనివాస్, ఎ. కవిత, ఎన్. సైదులు, జె. మంజుల, ఎండి. సాదిక్, ఎం. సౌమ్య, డి. కుసుమ, పి. తిరుమల, బి. నవీన్, ఎం. హైమావతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేషనల్ సైన్స్ డే ఘనంగా నిర్వహించిన పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News