Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:08 PM

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
28-02-2026 246 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు పనుల కారణంగా ఆదివారం (01వ తేదీ) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

తుమ్మలగూడెం సబ్‌స్టేషన్ పరిధిలోని భోగారం, సిరిపురం, తుమ్మలగూడెం గ్రామాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. అలాగే తుమ్మలగూడెం, నిధానపల్లి, భోగారం ప్రాంతాలకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ సరఫరా కూడా ఈ సమయంలో నిలిపివేయబడుతుంది.

లక్ష్మాపురం సబ్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురం, శోభనాద్రిపురం, నీర్నెంల గ్రామాల్లో సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. అదేవిధంగా రామన్నపేట పట్టణంలోని సబ్‌స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ సరఫరా నిలిపివేయబడుతుందని అధికారులు వెల్లడించారు.

పనులు పూర్తి అయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించాలని ఏఈ యం. కోటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Sthanikam

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News