Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:01 AM

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతికి టీజీఈ జేఏసీ వినతిపత్రం

17-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్‌లో తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ఉమా హారతికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ ఇంకా పలు కీలక సమస్యలు అలాగే ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భోజన విరామ సమయంలో డివిజన్, మండల కేంద్రాల్లో ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ముఖ్యంగా జూన్ 2 నాటికి పీఆర్సీ అమలు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, హెల్త్ కార్డుల అమలు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, పెండింగ్ డీఏల విడుదల, వీఆర్ఏల సమస్యల పరిష్కారం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించడం, సాధారణ బదిలీలు చేపట్టడం వంటి డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏసీ నాయకులు, తహసీల్దార్ హసీనా బేగం, వివిధ స్థాయి బాధ్యులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతికి టీజీఈ జేఏసీ వినతిపత్రం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News