Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:03 AM

నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బేటీ జన్మోత్సవం

16-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో,మహిళా సాధికారత కేంద్రం సహకారంతో బేటీ జన్మోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో పుట్టిన ఆడ శిశువులను గౌరవిస్తూ బేటీ జన్మోత్సవ కిట్లు మరియు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు.బాలిక జననాన్ని ఆనందంగా జరుపుకోవడం ద్వారా సమాజంలో బాలికల పట్ల గౌరవం మరియు ప్రోత్సాహం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.అలాగే పని చేసే ప్రదేశాల్లో మహిళలపై జరిగే లైంగిక వేధింపులను నివారించేందుకు అమలు చేస్తున్న పోష్ చట్టం (POSH) గురించి కూడా వివరించారు.మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండి అవసరమైన సమయంలో చట్టపరమైన సహాయం పొందాలని సూచించారు. అదేవిధంగా బేటీ జన్మోత్సవం సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి మాట్లాడుతూ,బాలికల రక్షణ, విద్య మరియు సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఎంతో ముఖ్యమని తెలిపారు. బాలిక పుట్టినప్పటి నుండి ఆమెకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందని చెప్పారు.సమాజంలో బాలికల పట్ల వివక్ష లేకుండా అందరూ సమానంగా చూడాలని ఆమె కోరారు.ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు మరియు మహిళలకు అవసరమైన వైద్య సేవలు, రక్షణ మరియు ఇతర సదుపాయాలను సమయానికి అందిస్తున్నామని తెలిపారు.మహిళల ఆరోగ్యం మరియు శిశువుల సంరక్షణ తమ ప్రధాన బాధ్యతగా భావిస్తూ అన్ని విధాలుగా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.నారాయణఖేడ్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీఓ శ్రీమతి సుజాత మాట్లాడుతూ,గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పోషకాహారం, గర్భధారణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు,అలాగే చిన్నపిల్లల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.పిల్లలను క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి,రీజినల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనురాధ, నారాయణఖేడ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మొగులయ్య, కానిస్టేబుల్, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది,ఆసుపత్రి సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బేటీ జన్మోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News