Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:12 AM

నారాయణఖేడ్ విద్యార్థినికి స్వర్ణ కిరీటం – సబ్ కలెక్టర్ చేతుల మీదుగా ఘన సత్కారం

27-02-2026 212 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణానికి మరో గౌరవకరమైన ఘనత దక్కింది. తెలంగాణ హిందీ ప్రచార సభ మరియు హిందీ సేవా సదన్ మహా విద్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందీ ప్రతిభా పరీక్షల్లో నారాయణఖేడ్ పట్టణంలోని వాటికన్ పాఠశాలకు చెందిన విద్యార్థిని యం. సౌజన్య ప్రతిభ కనబరచి స్వర్ణ పతకాన్ని సాధించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ చేతుల మీదుగా స్వర్ణ పతకం మరియు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ విషయం గురించి సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. రాంచందర్ వెల్లడించారు. హిందీ భాష పట్ల ఆసక్తి పెంపొందించడానికి, విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి పరీక్షలు ఎంతో దోహదపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ఇతర విద్యార్థులకు కూడా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హిందీ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. రాంచందర్, ట్రస్మా అధ్యక్షులు కుమ్మరి ప్రకాష్, వాటికన్ పాఠశాల ప్రిన్సిపాల్ కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.స్వర్ణ పతకం సాధించిన విద్యార్థిని సౌజన్యను పాఠశాల డైరెక్టర్ ప్రశాంత్, ప్రిన్సిపాల్ రమేష్, కరస్పాండెంట్ మారుతి, వైస్ ప్రిన్సిపాల్ రాధిక మరియు ఉపాధ్యాయ బృందం అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.అలాగే హన్మంతరావు పేట గ్రామస్థులు సౌజన్య సాధించిన ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సాధించిన ఈ గౌరవం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.హిందీ ప్రతిభా పరీక్షల్లో ప్రతిభ కనబరచి స్వర్ణ పతకం సాధించడం ద్వారా సౌజన్య ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. ఈ విజయంతో నారాయణఖేడ్ ప్రాంతం మరోసారి విద్యారంగంలో తన ప్రతిభను చాటుకుంది.

Sthanikam

నారాయణఖేడ్ విద్యార్థినికి స్వర్ణ కిరీటం – సబ్ కలెక్టర్ చేతుల మీదుగా ఘన సత్కారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News