Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:13 AM

నర్సీపట్నం ఆదివాసి గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలి

28-02-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నర్సీపట్నం: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం పరిసర ఆదివాసి గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వి. శంకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి భూములను బలవంతంగా ఖాళీ చేయించి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాన్ని ఖండించారు.

ఆదివాసి హక్కుల పరిరక్షణ కోసం కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చిన ఆయన, అటవీ హక్కుల చట్ట సవరణలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. చటర్జీపురం ఆదివాసీలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగార్రావు మాట్లాడుతూ, ఆదివాసీ హక్కుల సాధన కోసం మార్చి 30న నర్సీపట్నంలో “ఛలో ఆర్డీఓ” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు డి. హరినాథ్ మాట్లాడుతూ, ఆదివాసి భూముల రక్షణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఉదయ్ కిరణ్, కే. జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. 21 మందితో జిల్లా కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. జిల్లా కార్యదర్శిగా కోసూరి రాజు ఎన్నికయ్యారు. సమావేశంలో కేదారి దేవి, కె. సత్య, కడారి రాజేశ్వరి, తురె రవి, కేదారి రాజు, బాలరాజు, పవన్ కుమార్, గెమిలిచంటి రాజు తదితరులు హాజరయ్యారు.

Sthanikam

నర్సీపట్నం ఆదివాసి గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News