Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:25 AM

నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలు: కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

16-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నర్సాపూర్ మున్సిపాలిటీలో ఈరోజు జరుగనున్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల నేపథ్యంలో నర్సాపూర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టబడ్డాయి. ప్రజాస్వామ్య ప్రక్రియను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయబడినట్లు తెలియజేస్తున్నాము.ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేయబడతాయి. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న రహదారులు 200 మీటర్ల దూరంలోనే తాత్కాలికంగా బ్లాక్ చేయబడతాయి. ఎన్నికైన గౌరవ సభ్యులు మరియు డిపిఆర్ఓ ద్వారా అధికారిక అనుమతి పొందిన ప్రెస్ ప్రతినిధులకు మాత్రమే 200 మీటర్ల పరిధిలోకి ప్రవేశం కల్పించబడుతుంది.సాధారణ ప్రజలు అనవసరంగా ఆ ప్రాంతానికి రాకుండా, పోలీసు శాఖకు సహకరించవలసిందిగా నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి మనవి. ఈ చర్యలు ప్రజల భద్రత మరియు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు మాత్రమే చేపట్టబడుతున్నాయి.అలాగే కాగజ్ మద్దూర్ రూట్ వైపు వెళ్లే వాహనదారులు దయచేసి పోస్టాఫీస్ రూట్ ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించగలరు. ట్రాఫిక్ మార్పులపై పోలీసులు ఇచ్చే సూచనలను గౌరవించి, సహకరించగలరు.నర్సాపూర్ పట్టణ ప్రజలందరూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములై, పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము.

Sthanikam

నర్సాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలు: కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News