Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:09 PM

నార్కట్‌పల్లిలో మైనర్లకు పొగాకు అమ్మితే కఠిన చర్యలు

02-03-2026 310 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పాఠశాలల పరిసరాల్లో 100 మీటర్ల లోపల విక్రయాలు నిషేధం ఎస్సై విష్ణుమూర్తి హెచ్చరిక

ప్రమాదాల నివారణకు చౌరస్తాలో జాగ్ బారికేడ్లు ఏర్పాటు

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో మైనర్లకు పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నాడు నార్కట్‌పల్లి ఎస్ ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో స్థానిక కిరాణా దుకాణాలు, పాన్‌షాపుల యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.పాఠశాలల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయం పూర్తిగా నిషేధమని, మైనర్లకు సిగరెట్లు, గుట్కా, ఖైనీ తదితర పదార్థాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాలల సమీపంలోని దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.ఇదిలా ఉండగా, నార్కట్‌పల్లి చౌరస్తాలో గతంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ వాహనాల నియంత్రణకు జాగ్ బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఎస్సై తెలిపారు. సరైన సూచిక బోర్డులు లేకపోవడం, అతివేగం కారణంగా ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన బారికేడ్లు ప్రమాదాల నివారణకు దోహదపడతాయని,వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు.ప్రజల సహకారంతో నార్కట్‌పల్లిలో చట్టవ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఎస్సై విష్ణుమూర్తి తెలిపారు.

Sthanikam

నార్కట్‌పల్లిలో మైనర్లకు పొగాకు అమ్మితే కఠిన చర్యలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News