Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:14 PM

నార్కట్‌పల్లిలో అఖిలపక్షం ధర్నా మృతుల కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్ – పోలీసులతో తోపులాట

27-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నార్కట్‌పల్లి, మండల కేంద్రంలోని నల్గొండ చౌరస్తా వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంపై శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా జరిగింది. అసంపూర్తిగా ఉన్న రహదారి నుంచి అతివేగంగా వచ్చిన లారీ షాపులపైకి దూసుకెళ్లడంతో చోటుచేసుకున్న ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతుండగా పోలీసులు వారిని లేపేందుకు ప్రయత్నించడంతో కొంతసేపు తోపులాట జరిగింది. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది.

అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా రోడ్డు వెడల్పు పనులు నిలిచిపోవడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సంబంధిత శాఖ నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని విమర్శించారు. మృతుల కుటుంబాలను ఇప్పటివరకు ప్రభుత్వ ప్రతినిధులు పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, నార్కట్‌పల్లిలో అసంపూర్తిగా ఉన్న రహదారి పనులను తక్షణమే పూర్తి చేసి గ్రామాల కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

ధర్నాలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీజేపీ మండల అధ్యక్షుడు మెడబోయిన శ్రీనివాస్ యాదవ్, నోముల నాగరాజు, వడ్డేపల్లి నాగరాజు, ఎడ్ల మహాలింగం, నడింపల్లి శ్రవణ్ కుమార్, నీళ్లకంటి శ్రీకాంత్, మహేందర్, వడ్డగోని రామలింగం, పాలకూర రమేష్, మాదాసు నరేష్, గోదాల వెంకట్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నార్కట్‌పల్లిలో అఖిలపక్షం ధర్నా మృతుల కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్ – పోలీసులతో తోపులాట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News