Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:13 PM

నార్కట్ పల్లి లో అరుదైన స్నేహం కుక్క–కోతి మైత్రిని చూసి ఆశ్చర్యంలో మునిగిన స్థానికులు

03-03-2026 200 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో అరుదైన సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ఒకదానికొకటి దూరంగా ఉండే కుక్క, కోతి మధ్య ఏర్పడిన స్నేహం ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.పట్టణంలోని ప్రధాన వీధి సమీపంలో గత కొన్ని రోజులుగా ఒక కోతి, ఒక వీధికుక్క కలిసి తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఆహారం కోసం వెతుకుతూ, ఒకదానికొకటి దగ్గరగా కూర్చుని తినడం, విశ్రాంతి తీసుకోవడం వంటి దృశ్యాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కోతి చెట్టు పైకి ఎక్కినప్పుడు కుక్క చెట్టు కింద కాపలా కాస్తూ ఉండటం, కుక్కకు ఎవరైనా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే కోతి గట్టిగా అరుస్తూ హెచ్చరించడం వంటి సంఘటనలు అక్కడి వ్యాపారులు గమనించారు.స్థానిక వ్యాపారి చెబుతూ,“మొదటవీటిద్దరూతగువులాడతాయని అనుకున్నాం. కానీ ఇప్పుడు విడదీయరాని స్నేహితుల్లా మారిపోయాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు కలిసి తిరుగుతున్నాయి” అని తెలిపారు.పిల్లలు, పెద్దలు ఈ అరుదైన దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో కోతి కుక్కపై ప్రేమగా చేతులు వేసి నిమురడం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.జంతువుల మధ్య ఇలాంటి మైత్రి సహజసిద్ధంగా ఏర్పడడం అరుదైన విషయం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతిలో సహజ శత్రువులుగా భావించే జంతువుల మధ్య కూడా స్నేహం ఎలా పెరుగుతుందో నార్కట్పల్లిలో కనిపిస్తున్న ఈ సంఘటన స్పష్టంచేస్తోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం ఈ కుక్క–కోతి జంట పట్టణ ప్రజలకు ఆకర్షణగా మారింది. అధికారులు జంతువులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

నార్కట్ పల్లి లో అరుదైన స్నేహం కుక్క–కోతి మైత్రిని చూసి ఆశ్చర్యంలో మునిగిన స్థానికులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News