Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:08 AM

నల్లపోచమ్మ అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

26-04-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల బోరంచ గ్రామ శివారులో మంజీరా నది తీరాన వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో ఏడు ఆదివారాల మహోత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి ఆదివారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణ అంతా భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.మహోత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు నాగేష్ స్వామి ప్రత్యేక అభిషేకాలు, అలంకార పూజలు నిర్వహించి అమ్మవారికి మహామంగళహారతి ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని భక్తి పరవశంలో తరిశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, తాగునీరు, ప్రసాదం, దర్శనానికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు.స్థానిక పోలీసులు భద్రతా చర్యలు చేపట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించారు. ఏడు ఆదివారాల పాటు కొనసాగే ఈ మహోత్సవాలకు మరింత భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి, సిద్దు స్వామి, ప్రవీణ్ స్వామి, దేవస్థానం అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నల్లపోచమ్మ అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News