Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:26 AM

నాగేష్ షేట్కార్ నాయకత్వంలో కాబోయే చైర్మన్: భారీ మెజార్టీ గెలుపు

13-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 11న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో 15 వార్డులలో 11 కౌన్సిలర్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు.8వ వార్డు నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన కాబోయే మున్సిపల్ చైర్మన్ నాగేష్ షేట్కార్ పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గెలుపొందిన 11 మంది కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి కౌంటింగ్ ఆఫీస్ వద్ద పత్రిక మిత్రులతో మాట్లాడిన నాగేష్ షేట్కార్,మున్సిపాలిటీ పరిధిలోని అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరించి, పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.అలాగే,కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన లాభాలను చూసి పట్టణ ప్రజలు పెద్ద మెజార్టీతో 11 మంది అభ్యర్థులను గెలిపించారని ఆయన గుర్తుచేశారు.పార్టీ తరపున విజయం కోసం కృషి చేసిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పి చంద్రశేఖర్ రెడ్డి లకు పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.నాగేష్ షేట్కార్, గతంలో కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరించిన పట్టణాన్ని అభివృద్ధి పరుస్తూ,వార్డుల వారీగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని ఆయన ఆకాంక్షించారు.పార్టీ ఊహించిన విధంగా మంచి ఫలితాలు వచ్చినందుకు సురేష్ కుమార్ షేట్కార్, డాక్టర్ పి సంజీవరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, విద్యావంతులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు పట్టణ ప్రజలకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.నాగేష్ షేట్కార్,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలతో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు చేస్తారని,పట్టణ ప్రజల సహకారం అందరికి అవసరమని స్పష్టంగా తెలిపారు.

Sthanikam

నాగేష్ షేట్కార్ నాయకత్వంలో కాబోయే చైర్మన్: భారీ మెజార్టీ గెలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News