Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:11 PM

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర సందర్శన

27-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధనలకు ప్రత్యక్ష పరిచయం

నల్గొండ, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు ఫీల్డ్ విజిట్‌లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించారు. విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్‌లో జరుగుతున్న శాస్త్రీయ పరిశోధనలను విద్యార్థులు ఆసక్తిగా వీక్షించారు.

పరిశోధనా ప్రయోగశాలలను డాక్టర్ జ్యోతి ఆధ్వర్యంలో సందర్శించి, ఆధునిక పరికరాల వినియోగం, పరిశోధన విధానాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ భౌతిక శాస్త్రాన్ని పరిశీలనాత్మక దృక్కోణంలో అధ్యయనం చేస్తే లోతైన జ్ఞానం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉన్నత విద్య, పరిశోధనల ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు.

అనంతరం విశ్వవిద్యాలయంలోని విస్తృత గ్రంథాలయాన్ని సందర్శించిన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భౌతిక శాస్త్ర విభాగాధిపతి ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఉపన్యాసకులు వెంకట్ రెడ్డి, డాక్టర్ వి. వెంకటేశం, మన్నెం వెంకటయ్య, శశికళ పాల్గొన్నారు.

Sthanikam

నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర సందర్శన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News