Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

నడిమిపల్లిలో అప్పుడే పుట్టిన మగ శిశువు వదిలివేత – హిందూపురం ఆస్పత్రిలో చికిత్స

28-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి, ఫిబ్రవరి 28: మండలంలోని నడిమిపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన కలకలం రేపింది. ఉదయం సుమారు 5 గంటల సమయంలో గ్రామస్తులకు శిశువు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును రక్షించారు. సీడీపీవో ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. అనంతరం శిశువును ఆరోగ్య పరీక్షల నిమిత్తం హిందూపురం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

ప్రస్తుతం శిశువు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ప్రాథమిక పరీక్షల్లో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినప్పటికీ, మరొక రోజు పాటు పరిశీలనలో ఉంచాలని సూచించినట్లు సమాచారం.

ఈ ఘటనపై సోమందేపల్లి పోలీస్ స్టేషన్ లో ‘వదిలివేయబడిన శిశువు’గా జీడీఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయాన్ని బాలల సంరక్షణ విభాగం ద్వారా బాలల సంక్షేమ సమితికి తెలియజేశారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అనంతరం శిశువును సమితి ముందు ప్రవేశపెట్టి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

Sthanikam

నడిమిపల్లిలో అప్పుడే పుట్టిన మగ శిశువు వదిలివేత – హిందూపురం ఆస్పత్రిలో చికిత్స

Article Image

సోమందేపల్లి, ఫిబ్రవరి 28: మండలంలోని నడిమిపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన కలకలం రేపింది. ఉదయం సుమారు 5 గంటల సమయంలో గ్రామస్తులకు శిశువు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును రక్షించారు. సీడీపీవో ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. అనంతరం శిశువును ఆరోగ్య పరీక్షల నిమిత్తం హిందూపురం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

ప్రస్తుతం శిశువు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ప్రాథమిక పరీక్షల్లో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినప్పటికీ, మరొక రోజు పాటు పరిశీలనలో ఉంచాలని సూచించినట్లు సమాచారం.

ఈ ఘటనపై సోమందేపల్లి పోలీస్ స్టేషన్ లో ‘వదిలివేయబడిన శిశువు’గా జీడీఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయాన్ని బాలల సంరక్షణ విభాగం ద్వారా బాలల సంక్షేమ సమితికి తెలియజేశారు. ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అనంతరం శిశువును సమితి ముందు ప్రవేశపెట్టి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News