Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:10 AM

ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు అందజేసిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

13-03-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణ పరిధిలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం సోదర సోదరీమణులకు నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్, యువ నాయకుడు సాగర్ షేట్కార్ కలిసి పేద కుటుంబాలకు బియ్యం, పప్పులు, ఇతర అవసరమైన నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ సందర్భంగా నాగేష్ కుమార్ షేట్కార్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగ పరస్పర ప్రేమ, సహనం, దాతృత్వానికి ప్రతీక అని తెలిపారు. సమాజంలో ఉన్న నిరుపేదలకు తోడ్పాటు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ నెలలో పేదలకు సహాయం చేయడం గొప్ప సేవ అని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.సాగర్ షేట్కార్ మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు అవసరమైన సహాయం అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహిర్ అలీ, మైనుద్దీన్ కురేషి (కమిటీ అధ్యక్షుడు), యునుస్ (ఉపాధ్యక్షుడు), మజీద్, యూసుఫ్ కురేషి, సఫీ కురేషి, మజిదుద్దీన్, నుమాన్, సల్మాన్, జుబేర్, హషం అలీ, మొహీద్, గౌస్ చిష్తీ, ఖాజా భాయ్, ఇస్మాయిల్, రషీద్, మొయిన్ కురేషి తదితరులు పాల్గొన్నారు.స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ రంజాన్ సందర్భంగా పేదలకు సహాయం చేయడం అభినందనీయమైన సేవ అని పేర్కొన్నారు.

Sthanikam

ముస్లిం సోదరులకు నిత్యావసర సరుకులు అందజేసిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News