Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా విఘ్నేశ్వర పూజలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 06:25 PM

ముస్లిం సోదరులకు అల్పాహారం, మంచినీటి పంపిణీ

21-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండలో ఘనంగా రంజాన్ ప్రార్థనలు.. పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం

​నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో గల ఈద్గా మసీదు వద్ద శనివారం రంజాన్ పవిత్ర ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం, అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షలు,వన్ టౌన్ సీఐ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, అడ్వకేట్ కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేయడం అభినందనీయమన్నారు. గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీకగా హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, టౌన్ సి.ఐ. ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, శాంతియుత సంఘం ప్రతినిధి ఆఫీస్ ఖాన్, పెన్షనర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి, మైనార్టీ వెల్ఫేర్ జిల్లా నాయకులు డాక్టర్ ఏ.ఏ. ఖాన్, బీఎంపీ పార్టీ సీనియర్ నాయకులు అడ్వకేట్ నజీరుద్దీన్, బీఎస్పీ సీనియర్ నాయకులు ఎండి. మసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

​మరియు సంఘం నాయకులు కట్టెల రాములు, బండారు శంకర్, ఇరిగి భిక్షం, కొండేటి నరేష్ కుమార్, కందుల విజయ్ కుమార్, బాకీ తరుణ్, అల్లంపల్లి కొండన్న, మోత్కూరి కార్తీక్, ఈరిగి సిద్దు, గోపి నాయక్, కందుల సంపత్ తదితరులు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా అతిథులు నల్లగొండ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

ముస్లిం సోదరులకు అల్పాహారం, మంచినీటి పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News