Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:24 AM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం – నేడు పట్టణంలో భారీ ప్రదర్శన

16-02-2026 262 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో ఈ రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి నందు శేరికార్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో 11 వార్డులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడం విశేషం. ప్రజలు పార్టీపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతగా ఈ విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో 11 వార్డులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడం విశేషం. ప్రజలు పార్టీపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతగా ఈ విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకులు పి. చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షేట్కార్, యువత నాయకులు సాగర్ షేట్కార్ తదితరులు పాల్గొననున్నారు.మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా సాగనుంది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే సంకల్పంతో ఈ విజయోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం – నేడు పట్టణంలో భారీ ప్రదర్శన

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News