Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:17 AM

మంత్రి దామోదర్ రాజానర్సింహాను కలిసిన:ఎంపీ,ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

04-03-2026 172 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ నగరంలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహాను నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్‌గా ఇటీవల ఎన్నికైన నాగేష్ కూమార్ షేట్కార్,జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన ప్రాధాన్య పనులు, మౌలిక వసతుల విస్తరణ, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా మున్సిపల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి ను కోరారు. పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, రహదారులు, పారిశుద్ధ్య వసతులు కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు.మంత్రి ప్రతిపాదనలను శ్రద్ధగా విని, అభివృద్ధి పనులకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం తరఫున తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.ఈ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగి, నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధికి మరింత ఊతమివ్వనుందని ఆశాభావం వ్యక్తమైంది.

Sthanikam

మంత్రి దామోదర్ రాజానర్సింహాను కలిసిన:ఎంపీ,ఖేఢ్ మున్సిపల్ చైర్మన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News