Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

28-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మేరు కుల అభివృద్ధి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తాం...

మేరు కుల సంఘ భవన నిర్మాణానికి రూ.12 లక్షల నిధులు కేటాయిస్తాం..

-ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరి టౌన్:మేరు కుల అభివృద్ధి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి పట్టణంలోని మేరు సంఘ భవనంలో నిర్వహించిన టైలర్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రపంచానికి నాగరికతను నేర్పింది దర్జీలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం పుట్టగొడుగుల్లా పెరుగుతున్న రెడీమేడ్ వ్యవస్థ కారణంగా మేరు కులస్తులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో మేరు కులస్తుల జీవన స్థితిగతులపై ప్రస్తావించి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. కులస్తుల హక్కుల సాధనకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.

భువనగిరి పట్టణ మేరు కుల సంఘ భవన నిర్మాణానికి రూ.12 లక్షల నిధులు కేటాయిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్,మేరు సంఘం పట్టణ అధ్యక్షులు కీర్తి సత్యనారాయణ,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, గౌరవ అధ్యక్షులు తాళ్ల భాస్కర్, కాటారం భాస్కర్,మేడిగా జగదీష్, మొలుగూరి గౌరీశంకర్,రేణిగుంట్ల విట్టల్,తాళ్ల కిరణ్ కుమార్,కొత్త సత్యం, బాలరాజ్,దోమకొండ సత్యనారాయణ, లవణం ఉపేందర్,కౌన్సిలర్లు జంగయ్య, శివ,అమర్,సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి, ఫకీర్ కొండల్ రెడ్డి,మంగ ప్రవీణ్,మేరు కుల సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మేరు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News