Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:00 AM

మీ ఇంటి ఆడబిడ్డగా వచ్చిన నన్ను ఆశీర్వదించండి

10-02-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గోపయ్య చారి స్ఫూర్తితో ప్రజాసేవలోకి

46వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి పోలోజు మౌనిక పిలుపు

ప్రజలు ఆశీర్వదిస్తే 46వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి పోలోజు మౌనిక స్పష్టం చేశారు. సోమవారం 46వ వార్డులో నిర్వహించిన గడపగడపకు ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడారు.వార్డు ప్రజల మధ్యే ఉండి, వారి సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, నిత్యం ప్రజాసేవకు అంకితమైన వ్యక్తులకు ఓటు వేయాలని ఆమె కోరారు. మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చానని, ప్రజల ఆశీర్వాదమే తన బలం అని పేర్కొన్నారు.దేశ సేవలో ప్రాణాలర్పించిన తన తండ్రి గోపయ్య చారి స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని, అదే స్ఫూర్తితో వార్డు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. గత పది సంవత్సరాలుగా వార్డు సమస్యలపై పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడ్డానని గుర్తు చేశారు.నీటి సమస్య, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు మహిళలు, యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని ఆమె హామీ ఇచ్చారు. సేవ చేసే వారికే ప్రజలు పట్టం కట్టాలని కోరుతూ, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మీ ఇంటి ఆడబిడ్డగా వచ్చిన నన్ను ఆశీర్వదించండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News