Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:07 AM

మార్నింగ్ వాక్‌లో పార్క్ అభివృద్ధి పనుల పరిశీలన:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

16-04-2026 222 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో పట్టణ ప్రజల కోసం నిర్మిస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ పనులను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా సందర్శించి సమీక్షించారు. పార్కు ప్రాంతమంతా తిరిగి జరుగుతున్న పనుల పురోగతిని తెలుసుకుంటూ, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్య పరిస్థితుల్లో ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం అందించాలనే లక్ష్యంతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయడానికి, సేదతీరడానికి ఈ పార్క్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.పార్కులో వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల ఆట స్థలాలు, విభిన్న రకాల మొక్కల నాటడం వంటి పనులను వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ఈ పార్క్ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా పట్టణానికి కొత్త అందాన్ని తీసుకువస్తుందని, పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు కూడా కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి అనువైన ప్రదేశంగా మారుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పండరి రెడ్డి, రామచందర్ మాజీ ఎంపీటీసీలు, బాణాపురం రాజు, రుక్మిణి గోపాల్ రెడ్డి, షారుఖాన్, మహేష్ చౌహన్, సుబుర్, మున్సిపల్ కౌన్సిలర్లు, గంగారెడ్డి, సంగ్రామ్, మహేందర్ నాయక్ తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

మార్నింగ్ వాక్‌లో పార్క్ అభివృద్ధి పనుల పరిశీలన:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News