Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కక్కిరేణి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:08 PM

మార్చి 13న హైదరాబాదులో సామూహిక నిరాహార దీక్షలు

03-03-2026 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వికలాంగుల పెన్షన్ 6000లకు పెంచాలని, ఎంపిక అయిన లబ్ధిదారులకు పరికరాలు వెంటనే పంపిణీ చేయాలని, బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేస్తూ, మార్చి 13న హైదరాబాదులో సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి మనం ఉపేందర్ తెలిపారు.

ఈ రోజు బోనగిరి టౌన్ సుందరయ్య భవనం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో, జిల్లా అధ్యక్షులు సురుపంగా ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లపెళ్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతున్నాయని, ఈ సమయంలో వికలాంగుల పెన్షన్ 4016 నుండి 6000 కు పెంచాలని, చేయూత పెన్షన్లను 2016 నుండి 4000 కు పెంచాలని, 2023 డిసెంబర్ నుండి అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఉపేందర్ పేర్కొన్నారు. అయితే, 27 నెలలు గడిచినా ఇంకా పెన్షన్ పెంపు కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, ఇది చేయూత లబ్ధిదారులపై మోసం అవుతుందని ఆరోపించారు.

ప్రస్తుతానికి, రాష్ట్రంలో 44,49,767 మందికి పెన్షన్లు అందుతున్నాయని, 2026 జనవరి నాటికి 42,80,129 మందికి పెన్షన్లు అందుతాయని తెలిపారు. గత 27 నెలల్లో 1,69,638 మంది పెన్షన్లు రద్దు చేయబడ్డాయని, ప్రభుత్వం పెన్షన్ పెంచకుండా రద్దు చేసే హక్కు ఎక్కడ ఉందో ప్రశ్నించారు.

చేయూత పెన్షన్ల కోసం ప్రతి నెల 994.50 కోట్లు అవసరమని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 14628.91 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, కేవలం 10,514.32 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు తెలిపారు. 2026-27 బడ్జెట్లో 5 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇప్పటి వరకు 15,000 మంది దరఖాస్తుదారులకు అవసరమైన సహాయ పరికరాలను పంపిణీ చేయడం లేదని, ఈ పరికరాలకు 50 కోట్ల నిధులు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటన చేస్తూ, ఎందుకు పంపిణీ చేయడం లేదో సమాధానం చెప్పాలని క్షమాపణ కోరారు.

మార్చి 16 నుండి జరిగే బడ్జెట్ సమావేశాలలో పెన్షన్ల పెంపు పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన వెలువరించాలని, అలాగే, బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు.

Sthanikam

మార్చి 13న హైదరాబాదులో సామూహిక నిరాహార దీక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News